ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురం మండలంలోని ప్రముఖ పర్యాటక శైవ క్షేత్రం భైరవకోన జలపాతం తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రమాదకర రీతిలో ఉధృతంగా ప్రవహిస్తుంది. జలపాతాన్ని పామూరు సీఐ భీమా నాయక్ మంగళవారం సిబ్బందితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భైరవకోన జలపాతం ఉధృతంగా ప్రవహిస్తున్న దృష్ట్యా భక్తులు, పర్యాటకులు జలపాతాన్ని సందర్శించేందుకు రావద్దన్నారు. జలపాతం వద్ద ఉధృతి తగ్గిన తర్వాత అధికారుల సూచనల మేరకు సందర్శనకు అనుమతించడం జరుగుతుందన్నారు.