జహీరాబాద్: బర్దిపూర్ దత్తగిరి ఆశ్రమంలో నిర్వహించిన బిజెపి జాతీయ నేత మురళీధర్ రావు
సంగారెడ్డి జిల్లా జరా సంఘం మండలం బర్దిపూర్ శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో బిజెపి జాతీయ నాయకులు మురళీధర్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం మధ్యాహ్నం ఆశ్రమానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, వైదిక పాఠశాల విద్యార్థులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం దత్తాత్రేయ స్వామి, జ్యోతిర్లింగాలు, పంచ వృక్షాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు చెల్లించారు. ఈ సందర్భంగా ఆశ్రమ పీఠాధిపతి అవధూత గిరి మహారాజు ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆశ్రమంలో అన్ని వర్గాల వారికి ఉచిత వైదిక పాఠశాల నిర్వహించడం అభినందనీయం అన్నారు.