సంగారెడ్డి: సంగారెడ్డి పట్టణంలోని చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద వెదురు దినోత్సవ వేడుకలు
సంగారెడ్డి పట్టణంలోని చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద ఈనెల 18న వెదురు దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు మ్యా దరి సంఘం జిల్లా అధ్యక్షుడు అంబదాస్ తెలిపారు. సంగారెడ్డిలో బుధవారం నిర్వహించిన విలేకరి సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశానికి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ మహేంద్ర పాల్గొన్నారు.