ఖైరతాబాద్: జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నాం: జూబ్లీహిల్స్ లో మంత్రి సీతక్క
జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ఉందని మంత్రి సీతక్క అన్నారు. నవీన్ యాదవ్కు మద్దతుగా ప్రచారం నిర్వహించిన ఆమె.. బీఆర్ఎస్కు ప్రజలు అవకాశాలు ఇచ్చినా అభివృద్ధి చేయలేదని విమర్శించారు. రేషన్ కార్డులు, ప్రజల సంక్షేమం పరంగా మార్పు జరగలేదన్నారు. అన్నా.. అంటే నేనున్నా అని వచ్చే వ్యక్తి నవీన్ యాదవ్ అంటూ ఆమె కొనియాడారు. ఇకనైనా ప్రజలు అభివృద్ధి వైపు నిలబడాలని సీతక్క పిలుపునిచ్చారు.