ఒంగోలు అర్బన్: యోగా సాధన ద్వారా శారీరక ఆరోగ్యము, మానసిక ప్రశాంతత లభిస్తాయి: జిల్లా కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | Jun 8, 2026
యోగా సాధన ద్వారా శారీరక ఆరోగ్యము, మానసిక ప్రశాంతత లభిస్తాయని జిల్లా కలెక్టర్ శ్రీ.పి.రాజాబాబు చెప్పారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లావ్యాప్తంగా చేస్తున్న యోగా సాధనలో భాగంగా సోమవారం ప్రకాశం భవనం ఎదురుగా ఉన్న రోడ్డులో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇందుకోసం తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్ స్వయంగా నడుచుకుంటూ వచ్చారు. యోగాసనాలు వేసి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజల్లో స్ఫూర్తిని నింపారు.