BPL: లోక కళ్యాణార్థం ప్రతి ఏటా కార్తీకమాసంలో బనగానపల్లె హట్టిమునిస్వామి దేవస్థానం నుంచి నందవరం శ్రీ చౌడేశ్వరి మాత సన్నిధికి చేపట్టే తైలకలశాల పాదయత్ర మొక్కుబడి కార్యక్రమం ఆదివారం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. హట్టి మునిస్వామి దేవస్థానం నిర్వాహకుడు, VHP సంఘటన కార్యదర్శి దొంతా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలు ఆశ్రమం నుంచి తలపై తైల కలశాలను ఉంచుకొని ఓం నమో భగవతే కాశీ విశాలాక్ష్మి అంటూ అమ్మవారి నామస్మరణ చేస్తూ పాదయాత్రగా బయలుదేరి సాయంత్రం నందవరం చేరుకున్నారు. సుమారు 8 కిలోమీటర్లు సాగిన ఈ పాదయాత్రలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.