నంద్యాల అర్బన్: నంద్యాల జిల్లాలో మొరాయించిన ఆర్టీసీ బస్సు, తీవ్ర ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు
Nandyal Urban, Nandyal | Apr 21, 2026
నంద్యాల నుంచి అనంతపురం వెళ్తున్న తాడిపత్రి డిపో బస్సు పాణ్యం సమీపంలో సాంకేతిక లోపంతో మొరాయించింది. మంగళవారం రోడ్డు మధ్యలో బస్సు ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా ప్రయాణికులే వాహనాన్ని పక్కకు తోశారు. అనంతరం ప్రత్యామ్నాయ బస్సు ఏర్పాటు చేసి వారిని గమ్యస్థానాలకు తరలించారు. రోడ్డుపైనే బస్సు నిలిచిపోవడంతో ప్రయాణికులు కాసేపు ఆందోళనకు గురయ్యారు