ఒంగోలు అర్బన్: ఒంగోలు పట్టణంలో ఫిష్ ఫీడ్ దుకాణాలను ముయించి బంద్ చేపట్టిన ఆక్వా రైతులు
Ongole Urban, Prakasam | Jul 1, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని ఫిష్ ఫీడ్ దుకాణాలను బుధవారం రైతు సంఘం నాయకులు ఆక్వా రైతులు ముగించి వేశారు. పట్టణంలో బందుకు పిలుపునిచ్చారు. ఫీడ్ కంపెనీలు ధరలు తగ్గించకుండా ఆక్వా రైతులను కూలీలుగా మారుస్తుందని రైతు సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు స్వయంగా ధరలు తగ్గించాలని చెప్పినా ధరలు కేవలం రెండు రూపాయలు మాత్రమే తగ్గించి నిర్లక్ష్యం వహించారని ఆక్వా రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరలు తగ్గించకపోతే కోరుకునేది లేదని ఆక్వా రైతులు కంపెనీలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.