బాపట్ల జిల్లాలో 35 కేంద్రాల్లో యూరియా పంపిణీ చేస్తున్నాం: వ్యవసాయ శాఖ బాపట్ల జిల్లా అధికారి సుబ్రహ్మణ్యం
బాపట్ల జిల్లాలో సోమవారం 35 కేంద్రాలలో యూరియా పంపిణీ చేసినట్లు బాపట్ల జిల్లా వ్యవసాయ అధికారి సుబ్రహ్మణ్యం తెలిపారు. జిల్లాలోని రైతు సంరక్షణా కేంద్రాలు, పిఏసీఎస్లలో 440 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేశామన్నారు. జిల్లాలో ఇంకా 220 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయన్నారు. నేడు 4,983 మంది రైతులకు యూరియా పంపిణీ చేశామని తెలిపారు. రైతులు యూరియా కోసం ఆందోళన చెందవద్దన్నారు.