నియోజకవర్గంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని ఇస్తున్నాం: కాపవరంలో నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు
నిడదవోలు నియోజకవర్గంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని అందిస్తున్నామని ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు అన్నారు. ప్రతి గ్రామంలో ఓ హెచ్ ఆర్ ట్యాంకులు నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. పెరవలి మండలం కాపవరంలో రూ. 75 లక్షలతో నిర్మించిన వాటర్ ట్యాంకు బుధవారం రాత్రి 8 గంటలకు ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కచేర్ల ప్రసాద్, వైయస్సార్సీపి మండల అధ్యక్షులు వీరమల్ల సత్యనారాయణ, సర్పంచ్ బంటుమిల్లి రత్నాజీరావు, ఎంపీటీసీ మెర్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.