కర్నూలు: కర్నూలు ఓల్డ్ సిటీ ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో మైనార్టీ దినోత్సవం: మౌలానా అబుల్ కలాం ఆజాద్ నివాళి
మైనారిటీ దినోత్సవమును పురస్కరించుకొని "మౌలానా అబుల్ కలాం ఆజాద్ "గారి చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో ఎస్ ఎం డి షరీఫ్ అధ్యక్షతన మౌలానా అబుల్ కలాం ఆజాద్ బర్తడే సెలబ్రేషన్ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు స్వాతంత్ర అనంతరం మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ బాధ్యతలు తీసుకొని ఆయన పరిధిలో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొని వచ్చారని కొనియాడారు.