అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని చిన్మయి నగర్ వద్ద జెఎన్టియు విశ్వవిద్యాలయంలో గురువారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో జెఎన్టియు ఉపకులపతి హెచ్ సుదర్శన్ రావు 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను డెస్క్టాప్ ప్లానర్ ను ఉపకులపతి సుదర్శన్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉపకులపతి సుదర్శన్ రావు మాట్లాడుతూ జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలో 2026 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగిందని భవిష్యత్తులో ఈ యూనివర్సిటీ అభివృద్ధికి ప్రతి ఉద్యోగి సహకారం అందించాలని ఉపకులపతి హెచ్ సుదర్శన్ రావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జేఎన్టీయూ హెచ్ ఓ డీ లు అంతా పాల్గొన్నారు.