లింగంపేట్: చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు, ఐలమ్మ విగ్రహానికి పాలాభిషేకం చేసిన బీజేపీ నాయకులు
లింగంపేట మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణకు నిజాం నుంచి విముక్తి లభించేందుకు ఐలమ్మ చేసిన పోరాట స్ఫూర్తి మరువలేనిదని బీజేపీ సీనియర్ నాయకుడు డా. పైడి ఎల్లారెడ్డి కొనియాడారు. ఆమె భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం పోరాడారని, ఆమె స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం రూపుదిద్దుకుని తెలంగాణ సాధించామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. నిజం దొరలకు ఎదురు తిరిగి నిలిచిన వీర వనిత అని అన్నారు. మండల అధ్యక్షుడు క్రాంతి, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.