గుంతకల్లు: మృత్యువు పై ఘనవిజయం క్రీస్తు పునరుత్థానం: గుత్తిలో పాస్టర్లు డేవిడ్ నాయక్, సాల్మన్ బాబు
మృత్యువుపై ఘనవిజయం క్రీస్తు పునరుత్థానం అని పాస్టర్లు డేవిడ్ నాయక్, సాల్మన్ బాబు అన్నారు. గుత్తి,గుత్తి ఆర్ ఎస్ లలో సీఎస్ఐ చర్చిలలో ఆదివారం ఈస్టర్ వేడుకలను క్రైస్తవులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. ఏసుక్రీస్తు జీవితం ప్రత్యేకమైనది, విలక్షణమైనదన్నారు. మరణపు మెడలు వంచి మరణ భయం నుంచి మనిషిని విడిపించడానికి యేసయ్య పునరుత్థానం చెందాడన్నారు. ప్రతి ఒక్కరూ ఏసుప్రభువును ప్రార్థించాలన్నారు.