ఒంగోలు అర్బన్: ఒంగోలులోని 16 నెంబర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల నివారణకు స్టాపర్లను ఏర్పాటు చేసిన పోలీసులు
Ongole Urban, Prakasam | Jul 8, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు లోని 16 నెంబర్ జాతీయ రహదారిపై బుధవారం పోలీసులు స్టాపర్లను ఏర్పాటు చేశారు. ఇటీవల కాలంలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో ఈ స్టాపర్ లో ఏర్పాటు చేసినట్లు పోలీసులు చెప్పారు. వాహనదారులు కూడా మితిరిన వేగంతో వాహనాలు నడిపి ప్రమాదాల బారిన పడకుండా పరిమిత వేగంతో వాహనాలు నడిపి సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరాలని వాహనదారులకు పోలీసులు సూచిస్తున్నారు.