ఆళ్లగడ్డ: రుద్రవరం మండలంలో రోడ్డు ప్రమాదం పెళ్లింట విషాదం ఇద్దరు బావలు మృతి
నంద్యాల జిల్లా రుద్రవరం మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల తీవ్ర విషాదం నింపింది, బామ్మర్ది పెళ్లి నుంచి తిరిగి వస్తుండగా కారు ఢీకొనడంతో సిరివెళ్ల మండలం దర్బాదర్ కు చెందిన కృష్ణ, ఆర్ నాగులవరం గ్రామానికి చెందిన చిన్న నరసింహులు మృతి చెందారు, ప్రమాదంలో దర్బా దర్ కు చెందిన మద్దిలేటి మహానంది మండలం బుక్కాపురానికి చెందిన శ్రీనివాసులు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు