నందికోట్కూరు: లబ్ధిదారులకు సీఎంఆర్ ఎఫ్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే జయసూర్య
సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను ఆదివారం నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త జయ సూర్య లబ్ధిదారులకు అందజేశారు, నందికొట్కూరు మండలం మల్యాల కు చెందిన నక్కల మద్దిలేటి కి 9,45,393, తాత నాగిరెడ్డికి రూ.81,964 విలువైన చెక్కులను వారి ఇంటి వద్దకు వెళ్లి అందజేశారు, అనారోగ్యంగా ఉన్న వ్యక్తులకు సీఎంఆర్ఎఫ్ వరం లాంటిదని ఎమ్మెల్యే పేర్కొన్నారు, ఆయనతోపాటు తెలుగుదేశం పార్టీ నందికొట్కూరు మండల కన్వీనర్ మాండ్రా సురేంద్రనాథ్ రెడ్డి, బాల మద్దయ్య తదితరులు పాల్గొన్నారు