మైదుకూరు సీఐ రమణారెడ్డి, ప్రతి విద్యార్థి సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గురువారం పట్టణంలోని కస్తూరిబా బాలిక విద్యాలయంలో సైబర్ మోసాలు, సోషల్ మీడియా, మరియు ట్రాఫిక్ అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.విద్యార్థులు చదువుపై పూర్తి దృష్టి పెట్టి, సెల్ ఫోన్ల నుండి దూరంగా ఉండాలని సీఐ సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు కూడా పాల్గొన్నారు.