ఒంగోలు అర్బన్: డి ఆర్ డి ఓ బృందంతో కలిసి దొనకొండ ఇండస్ట్రియల్ కారిడార్ ను సందర్శించిన జిల్లా కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | Jul 3, 2026
దొనకొండ మండల పరిధిలోని దొనకొండ ఇండస్ట్రియల్ పార్కులో బీడీఎల్ ప్రతిపాదిత ప్రాజెక్టు స్థలాన్ని శుక్రవారం డీఆర్‌డీవో బృందం, జిల్లా కలెక్టర్ రాజాబాబు తో కలసి సందర్శించడం జరిగింది. పరిశీలన సందర్భంగా డీఆర్‌డీవో బృందానికి జిల్లా అధికార యంత్రాంగం ప్రాజెక్టు స్థలానికి సంబంధించిన వివరాలు, అందుబాటులో ఉన్న మౌలిక వసతులు, భవిష్యత్తు విస్తరణ అవకాశాలు తదితర అంశాలను వివరించింది.అనంతరం దొనకొండ ఎంపిడిఓ కార్యాలయం సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, బృందం సభ్యులతో సమావేశమై సదరు ప్రాజెక్టు పై చర్చించడం జరిగింద.. బృందం సభ్యులు ప్రాజెక్టు వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు