కలెక్టర్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో 178 ఫిర్యాదులు వచ్చాయి అధికారులు
హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ప్రజావాణి కార్యక్రమంలో హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి వై.వి. గణేష్ పాల్గొని ప్రజల నుండి విజ్ఞప్తులను స్వీకరించారు. సమస్యల పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులు చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు