వేపకుంట గ్రామంలో ఎస్సీ కాలనీలో వాటర్ ట్యాంకును పరిశీలించిన మార్కెట్ యార్డ్ చైర్మన్ సుధాకర్ నాయుడు ఆర్డబ్ల్యూఎస్ అధికారుల
సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం వేపకుంట ఎస్సీ కాలనీలో గురువారం నాలుగు గంటల పది నిమిషాల సమయంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ సుధాకర్ నాయుడు ఆర్డబ్ల్యూఎస్ ఏఈ తదితరులు వేపుకుంట ఎస్సీ కాలనీలో వాటర్ ట్యాంక్ పగుళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ సుధాకర్ నాయుడు మాట్లాడుతూ వేపకుంట ఎస్సీ కాలనీలో వాటర్ ట్యాంకు పగలు వచ్చి నీరు మొత్తం బయటికి వెళ్లిపోవడం జరిగిందని ఈ సమస్యను పరిష్కరించాలని ఆర్డబ్ల్యూఎస్సీ ఇతర అధికారులతో కలిసి పరిశీలించడం జరిగిందని త్వరలోనే వేపకుంటలో నీటి సమస్య లేకుండా ఏర్పాటు చేస్తామని మార్కెట్ యార్డ్ చైర్మన్ సుధాకర్ నాయుడు పేర్కొన్నారు.