ఒంగోలు అర్బన్: ఒంగోలులో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్
Ongole Urban, Prakasam | Jul 10, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ శుక్రవారం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు ఇందులో భాగంగా ఒంగోలు నగరంలోని కమ్మపాలెం నందు 5.25 కోట్లతో నిర్మిస్తున్న మెయిన్ రోడ్డు పనులు పరిశీలించే కార్యక్రమంలో పాల్గొన్నారు, అనంతరం ఒంగోలు నగర పరిధిలోని త్రోవగుంట APIIC పార్క్ ఆటోనగర్ నందు 10.30 కోట్లతో చేపట్టిన పనులు పరిశీలించే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి పనులను చేయాలని కాంట్రాక్టర్లకు ఆదేశించారు నియోజకవర్గ అభివృద్ధిలో అందరం భాగస్వామ్యం కావాలని కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నేతలు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు