కోడుమూరు: గూడూరులో PMAY లబ్ధిదారుల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి
గూడూరు మండల కేంద్రంలో బుధవారం పీఎంఏవై ఇళ్ల లబ్ధిదారుల గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తుందన్నారు. ఇల్లు లేని పేదలను గుర్తించి వారి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. హాజరైన ఎమ్మెల్యే కు స్థానిక నాయకులు సాదర స్వాగతం పలికారు. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే లబ్ధిదారుల ఇళ్లను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.