గుంతకల్లు: తెలంగాణ ఇంటర్ పరీక్ష ఫలితాల్లో సత్తా చాటిన గుత్తి విద్యార్థి సుజిత్ కుమార్, ఎంపీసీలో 989 మార్కులు
తెలంగాణ ఇంటర్ పరీక్ష ఫలితాలు ఆదివారం ఆ రాష్ట్ర ఇంటర్ బోర్డు విడుదల చేసిన విషయం తెలిసిందే. గుత్తికి చెందిన మీసేవ నిర్వాహకుడు సురేష్ కుమారుడు సుజిత్ కుమార్ వైరాబాదులోనూ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో చదువుతున్నాడు.ఎంపీసీలో 1000 మార్కులకు గాను 989 మార్కులు సాధించి సత్తా చాటాడు. సుజిత్ కుమార్ ను ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించి, శుభాకాంక్షలు తెలియజేశారు.