ఒంగోలు అర్బన్: ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను ఉపయోగించుకుని పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు యువత ముందుకు రావాలి : జిల్లా కలెక్టర్
Ongole Urban, Prakasam | May 25, 2026
ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను ఉపయోగించుకుని పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు యువత ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు పిలుపునిచ్చారు. సోమవారం ఒంగోలు మండలం దసరాజుపల్లి గ్రామంలో 5 ఎకరాల విస్తీర్ణంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి పరిశ్రమల ( ఎం.ఎస్.ఎం.ఈ) పార్క్ ఏర్పాటుకు శంకుస్థాపన కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు శ్రీ.దామచర్ల జనార్ధన్ రావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో స్థానికులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడారు. ప్రకాశం జిల్లాలో రామాయపట్నం పోర్టు, బీపీసీఎల్, ఇండో సోల్, జిందాల్ వంటి పెద్ద పరిశ్రమల రాకతో పారిశ్రామికీకరణ వేగం పుంజుకున్నట్లు చెప్పారు.