బెల్లంపల్లి: నిల్వాయి వ్యవసాయ సహకార కార్యలయం వద్ద యూరియా బస్తాల కోసం అధికారులను నిలదీసిన రైతులు
వేమనపల్లి మండలం నిల్వాయి వ్యవసాయ సహకార కార్యాలయంలో యూరియా బస్తాల కోసం అధికారులను రైతులు నిలదీశారు వచ్చిన యూరియా బస్తాలు స్టాక్ అయిపోవడంతో రైతులు ఆందోళనకు దిగారు ఈ సందర్బంగా రైతులు మాట్లాడుతూ తెల్లవారు జాము నుండి యూరియా బస్తాల కోసం లైన్ లో నిలబడి ఉండగా స్టాక్ అయిపోయిందని చెప్పడం ఏంటని అగ్రహించారు రైతులందరికి యూరియా అందాల చూస్తామని అధికారుల హామీతో ఆందోళన విరమించారు