బనగానపల్లె: యువత రక్తదానానికి ముందుకు రావాలి . బనగానపల్లెలో నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు టంగుటూరి సీనయ్య
రక్తదానం ద్వారా అనేక మంది ప్రాణాలను కాపాడవచ్చని, ప్రతి ఆరోగ్యవంతుడు స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు టంగుటూరి శీనయ్య పేర్కొన్నారు. ఆదివారం ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని బనగానపల్లె ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. యువత రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు