నంద్యాల అర్బన్: నంద్యాలలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా సిపిఎం ఆధ్వర్యంలో నిరసన
Nandyal Urban, Nandyal | May 26, 2026
పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలంటూ మంగళవారం నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రభాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలను పెంచుతూ పేదవాడి నడ్డి విరుస్తుందని విమర్శించారు రోజురోజుకు పెరుగుతున్న నిత్యవసర సరుకుల ధరలతో పాటు పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని వారు డిమాండ్ చేశారు