గుంతకల్లు: చెట్నేపల్లిలో విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న లారీ, త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని చెట్నేపల్లిలో శనివారం ఓ లారీ అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొనింది. దీంతో విద్యుత్ స్తంభం విరిగి కింద పడిపోయింది. అదృష్టవశాత్తు తృటిలో పెను ప్రమాదం తప్పింది. లారీ డ్రైవర్ రాజ్ కుమార్ సురక్షితంగా బయటపడ్డాడు. అయితే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. స్థానికులు పోలీసులకు, విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టారు.