ఒడిశా నుంచి నగరానికి గంజాయి రవాణా చేస్తున్న భార్య భర్తలను STF బీ టీమ్ ఎల్బీనగర్ చౌరస్తాలో పట్టుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు సోదలు చేసిన అధికారులు నిందితులను అదుపులోకి తీసుకొని 3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఇద్దరినీ సరూర్నగర్ ఎక్సైజ్ స్టేషన్కు అప్పగించారు.