గుంటూరు: ప్రగతి నగర్లో పర్యటించిన జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా
Guntur, Guntur | Sep 24, 2025 గుంటూరు నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు అస్వస్థతకు గురై వాంతులు, విరోచనాలతో బాధపడుతున్నారని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా తెలిపారు. బుధవారం ఉదయం నగరంలోని ప్రగతి నగర్లో జిల్లా కలెక్టర్ పర్యటించారు. అనంతరం మీడియాతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ డయేరియా, కలరా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తీసుకోవాలని కోరారు.