అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని డీఎస్పీ కార్యాలయం, రూరల్ సర్కిల్ కార్యాలయాన్ని అనంతపురం జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్షిక తనిఖీలలో భాగంగా గురువారం తనిఖీలు చేసి పోలీసు అధికారులకు సూచనలు చేశారు. గుంతకల్లు సబ్ డివిజన్, గుంతకల్లు సర్కిల్ పరిధిలో నమోదైన గ్రేవ్, నాన్ గ్రేవ్, ప్రాపర్టీ అఫెన్స్, రికవరీ శాతం, గ్రేవ్ యూఐపీటీ, తదితర కేసులను ఎస్పీ సమీక్ష చేశారు. ఆయా కేసుల్లో పోలీసులు ఎలాంటి పురోగతి సాధించారు, కింది స్థాయి సిబ్బందికి, అధికారులకు డీఎస్పీ ఎలాంటి సూచనలు, సలహాలు ఇచ్చారోఎస్పీ ఆరా తీశారు.