కనిగిరి: ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడం దుర్మార్గమైన చర్య : వైసీపీ కనిగిరి నియోజకవర్గ ఇన్చార్జి నారాయణ యాదవ్
పెదచెర్లోపల్లి మండలంలోని చింతగుంపల్లి, వేప గుంపల్లి గ్రామాల్లో కనిగిరి నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జ్ దద్దల నారాయణ యాదవ్ ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేయడానికి నిరసిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రజల నుండి ఆయన సంతకాలను సేకరించారు. మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరం చేయడం దుర్మార్గమని నారాయణ యాదవ్ అన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు వైసిపి పోరాడుతుందన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.