కొలను భారతి దేవి క్షేత్రానికి వెళ్లే దారిలో అటవీశాఖ అధికారులు భారీ గేటు ఏర్పాటు
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండల పరిధిలోని కొలను కొలను భారతి దేవి క్షేత్రానికి వెళ్లే దారిలో అటవీశాఖ అధికారులు భారీ గేటు ను ఏర్పాటు చేశారు, కొలను భారతి క్షేత్రం దట్టమైన నల్లమల అడవి ప్రాంతంలో ఉండటం వల్ల భద్రత దృష్ట్యా సమీపంలో ఉన్న చెంచుగూడెం గిరిజనులకు హాని తలెత్తకుండా గేటు ఏర్పాటు చేసినట్లు అటవీ శాఖ అధికారులు వెల్లడించాడు, ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటలకు ఆలయానికి చేరుకునేందుకు అనుమతి ఉంటుందన్నారు, సమీప ప్రజలకు అడవి మృగాల నుంచి హాని కలగకుండా గేటు ఏర్పాటు చేసినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు