ఆళ్లగడ్డ: రుద్రవరం మండలంలో: నలుగురు విద్యుత్ ఆపరేటర్ల తొలగింపు, విద్యుత్ ఏఈ రాజశేఖర్
నంద్యాల జిల్లా రుద్రవరం మండలంలో నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగంలో చేరిన నలుగురు ఆపరేటర్ల పై వేటుపడింది,యల్లా వత్తుల సబ్ స్టేషన్ ఆపరేటర్ హరి, చిన్న కంబలూరులో పెద్దిరెడ్డి, ఆలమూరులో నరసింహ నాయక్, హరి నగరంలో ఆంజనేయులను విద్యుత్ అధికారులు విధుల నుంచి తొలగించారు, ఈ విషయాన్ని ఏ ఈ రాజశేఖర్ ధ్రువీకరించారు, ఉన్నతాధికారుల తనిఖీల్లో నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం వెలుగు చూసింది, తప్పుడు పద్ధతుల్లో చేరిన వారిపై చర్యలు తప్పవని విద్యుత్ అధికారులు హెచ్చరించారు