ఆళ్లగడ్డ: చింతకుంట గ్రామంలో మన భూమా మన ధీమా కార్యక్రమం లో పాల్గొన్న ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలోని చింతకుంట గ్రామంలో కర్రెమ్మ మారెమ్మ దేవతలను గురువారం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు, అనంతరం చింతకుంట గ్రామంలో మన భూమా మన ధీమా కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఇంటింటిని పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు వాటి పరిష్కారానికి కృషి చేస్తామని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హామీ ఇచ్చారు, ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు హర్షవర్ధన్ రెడ్డి ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు