ఒంగోలు అర్బన్: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మహిళలకు శక్తి యాప్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన పోలీసులు
Ongole Urban, Prakasam | Apr 22, 2026
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మహిళలకు శక్తి యాప్ పై బుధవారం పోలీసులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. బస్టాండ్లు, కీలక సెంటర్లు గ్రామీణ ప్రాంతాలలో పోలీసులు మహిళల స్మార్ట్ ఫోన్లో శక్తి యాప్ డౌన్లోడ్ చేయించారు. మహిళలు తమ ఆపద సమయంలో ఈ యాప్ ద్వారా పోలీసులను సంప్రదించినట్లయితే పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని వారికి రక్షణ కల్పిస్తారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రత కొరకు ఈ యాప్ రూపొందించిందని పోలీసులు మహిళలకు తెలిపారు.