ఒంగోలు అర్బన్: నాడు ప్రభుత్వంలో ఎస్సీ లపై దాడులు చేస్తే నేడు ఎస్సీలకు ఆత్మగౌరవం పెంపొందిస్తున్నాం : మంత్రి స్వామి
Ongole Urban, Prakasam | May 20, 2026
నాటి ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి మంత్రులు ఎస్సీ లపై దాడులు చేసే ఇబ్బందులకు గురి చేస్తే ప్రస్తుత ప్రభుత్వంలో ఎస్సీలకు ఆత్మగౌరవం పెంపొందిస్తున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోల బాల వీరాంజనేయ స్వామి బుధవారం మీడియాకు తెలియజేశారు. ఒంగోలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ను వేధించి హత్య చేశారని ఎస్సీల పై దాడులు చేసి అట్రాసిటీ కేసులు పెట్టారని మండిపడ్డారు నేడు ఎస్సీల అభ్యున్నతికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు ఇసుక మాఫియాను ప్రశ్నించినందుకు శిరోమండనం చేశారని గుర్తు చేశారు