నంద్యాల అర్బన్: నంద్యాల జిల్లాలో ప్రారంభమైన విజయ్ దేవర కొండ, రష్మిక సినిమా షూటింగ్ ప్రారంభం
Nandyal Urban, Nandyal | Jun 29, 2026
నంద్యాల జిల్లా ఓర్వకల్లు రాక్ గార్డెన్లో 'రణబలి' సినిమా షూటింగ్ సందడిగా సాగుతోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రవిచంద్ర నిర్మాతగా, రాహుల్ సాంకేతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం విలన్కు సంబంధించిన కీలక సన్నివేశాలను రాక్ గార్డెన్లో చిత్రీకరిస్తున్నారు. షూటింగ్కు అంతరాయం కలగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు