ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ ప్రభుత్వాసుల్లో రోగులకు తాగునీటి కష్టాలు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు తాగునీటి సమస్య తీవ్రంగా మారింది, దాతల సహకారంతో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ ప్రస్తుతం పని చేయకుండా వృధాగా పడి ఉండడంతో ఆసుపత్రికి వచ్చే రోగులు వారి సహాయకులకు త్రాగునీటి కష్టాలు మొదలయ్యాయి, వైద్యాధికారులు స్పందించి తక్షణమే తాగునీటి సౌకర్యం కల్పించాలని రోగులు కోరుతున్నారు