కొత్తగూడెం: చర్ల మండలం బట్టి గూడానికి చెందిన రవ్వ భీమా అనే మహిళకు పురిటి నొప్పులు రావడంతో జట్టిలో తీసుకొచ్చిన కుటుంబ సభ్యులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని బట్టి గూడానికి చెందిన రవ్వ భీమాకు సోమవారం సాయంత్రం పురిటినొప్పులు వచ్చాయి.. మండల కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో గ్రామం ఉండటంతో అప్పటికే చీకటి పడటంతో చేసేది లేక భీమా కుటుంబ సభ్యులు,స్థానికులు జడ్పీలు అడవి ప్రాంతం మీదుగా మోసుకుంటూ రోడ్డు బాగున్న ఆరు కిలోమీటర్ల దూరంలోని తిప్పాపురం వరకు తీసుకొచ్చారు.. తిప్పాపురం రహదారిపై ఆమె ప్రసవించింది.. పండంటి బాబుకు జన్మనిచ్చిందని తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు..