జహీరాబాద్: పట్టణంలో కారబట్టిలపై పోలీసుల దాడులు, కల్తి వస్తువుల స్వాధీనం, కేసు నమోదు
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ పరిధిలో నాణ్యత, భద్రత పాటించని కార బట్టి లపై పోలీసులు దాడులు నిర్వహించారు. పట్టణంలోని ప్రగతి నగర్, హమాలి కాలనీలో శుభ్రత నాణ్యత లేని వస్తువులతో పిండి వస్తువులను తయారు చేస్తూ పరిసర ప్రాంతాల్లో వ్యాపారం నిర్వహిస్తున్నట్లు గుర్తించి మంగళవారం ఎస్సై వినయ్ కుమార్ రాజేందర్ రెడ్డిలు సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. నాణ్యతలేని కల్తీ వస్తువులను స్వాధీనం చేసుకుని కారబట్టి యజమానులు పరాస్నాథ్, పెరమల్ పై కేసు నమోదు చేసినట్లు వినయ్ కుమార్ తెలిపారు.