కనిగిరి: కలుషిత నీరు తాగడం వల్లే బడుగు లేరు ఎస్సీ కాలనీలోని విద్యార్థులకు కామెర్లు వచ్చాయని డీఎంహెచ్వో వెంకటేశ్వర్లు తెలిపారు. కనిగిరి ప్రభుత్వ వైద్య శాలలో గురువారం కామెర్లు వచ్చిన విద్యార్థులను ఆయన పరామర్శించారు. అనంతరం వైద్యశాలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బడుగులేరు ఎస్సీ కాలనీలో మంచినీటి బోరు వద్ద కలుషితమైన నీరు చేరడం, వాటి వల్ల వైరస్, బ్యాక్టీరియా వ్యాపించి అవి తాగిన విద్యార్థులకు కామెర్లు వచ్చాయన్నారు. విద్యార్థులు ప్రస్తుతం బాగానే ఉన్నారని, భయపడాల్సిన పని లేదన్నారు.