ఒంగోలు అర్బన్: మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఒంగోలు జనసేన నాయకుడు షేక్ రియాజ్
Ongole Urban, Prakasam | Jul 1, 2026
మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నారని ప్రకాశం జిల్లా మాజీ అధ్యక్షుడు ఊడా చైర్మన్ షేక్ రియాజ్ అన్నారు. బుధవారం ఒంగోలు జనసేన కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. అమరావతి రాజధానిపై జగన్ విషయం కక్కుతున్నారని అన్నారు. ఈసారి ప్రజలు ఆ 11 కూడా ఇవ్వరని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక పెయిడ్ ఆర్టిస్టులతో విషం చిమ్మిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు