నంద్యాల అర్బన్: నంద్యాలలో రోడ్లపై గుంతలు తీశారు... పూడ్చడం మర్చిపోయిన అధికారులు
Nandyal Urban, Nandyal | Jul 3, 2026
నంద్యాలలోని సాయిబాబా నగర్ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్లే దారిలో పైప్ లైన్ కోసం గుంతలు తీశారు కానీ పూడ్చడం మరిచారని ప్రజలు మండిపడుతున్నారు. పైప్ లైన్ పనులు పూర్తై వారం రోజులైనా గుంతలు పూడ్చే నాథుడే లేడని వాపోతున్నారు. విద్యార్థులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారని సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.