అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి పోటెత్తిన భక్తులు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండల పరిధిలోని అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం శనివారం భక్తులతో పోటెత్తింది, వేసవి సెలవులు పెళ్లిళ్ల ముహూర్తాలతో శనివారం తెల్లవారు జాము నుంచే భక్తులు, యాత్రికులు తరలివస్తున్నారు, ఎగువ జిగువ అహోబిలంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు, అర్చకులు పూజలు చేసి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు, భక్తుల రద్దీ పెరగడంతో ఆలయ పరిసరాలు కోలాహలంగా మారాయి.