రాజేంద్రనగర్: మాల గూడలో విషాదం.. హార్డ్ స్ట్రోక్ తో ఓ మహిళ మృతి
కందుకూరు మండలం మాలగూడలో విషాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన వల్లవోజు సత్తమ్మ తన కూతురు ఇంటికి వెళ్లింది. అక్కడ ఛాతి నొప్పి వస్తుందని చెప్పడంతో ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్కు తరలించారు. హాస్పిటల్లో చికిత్స జరుగుతుండగా హార్ట్ స్ట్రోక్ రావడంతో మృతిచెందిందని డాక్టర్లు నిర్ధారించారు. ఆమె మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.