గుంతకల్లు: గుత్తి రైల్వే స్టేషన్ లో గూడ్స్ రైలు కింద పడి అబ్బారెడ్డి అనే వ్యక్తి ఆత్మహత్య, కేసు నమోదు చేసిన పోలీసులు
అనంతపురం జిల్లా గుత్తి రైల్వే స్టేషన్ యార్డులో యు.అబ్బారెడ్డి అనే వ్యక్తి గూడ్స్ రైలు కింద పడి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. గుత్తి జీఆర్పీ ఎస్ఐ మహేంద్ర తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుత్తి అర్ఎస్ ఎస్ఎస్.పల్లి కురువ విధికి చెందిన అబ్బారెడ్డి గత కొన్ని నెలలుగా గుండె సంబంధిత వ్యాధితో బాధ పడుతుండే వాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన అతడు ఇంటి నుంచి వెళ్లిపోయి సూసైడ్ నోట్ రాసుకొని గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.