పెద్దవంగర: పోచంపల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో వడదెబ్బకు గురై, గుగులోతు కిషన్ అనే రైతు మృతి
మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలం పోచంపల్లి గ్రామంలో వడ దెబ్బతో ధాన్యం కొనుగోలు కేంద్రంలో వడ్లు పడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలి రైతు గుగులోతు కిషన్ (51)మృతి చెందారు. అధికారుల కొనుగోలు సెంటర్లో సరైన వసతులు, తాగడానికి నీళ్లు లేకనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని స్థానిక రైతులు వాపోతున్నారు ఇప్పటికైనా అధికారులు సరైన వసతులు కల్పించి కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే తరలించాలని కోరారు.