బెల్లంపల్లి పట్టణం వ్యవసాయ మార్కెట్ లో సివిల్ సప్లై హమాలి కార్మికుల సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధానకార్యదర్శి మేకల దాసు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వానికి వారి మనుగడకు తప్ప కార్మిక వర్గానికి ప్రయజోనం లేని 4 లేబర్ కోడ్ లను తీసుకువచ్చి కార్మిక వర్గానికి హక్కులు లేకుండా చేస్తున్న బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను మానుకోవాలని డిమాండ్ చేశారు ఈ మేరకు జూలై 9వ తేదీన నిర్వహించనున్న దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను అన్ని రంగాల కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు